Chiranjeevi: తన సినిమాలు రీమేక్ చేస్తే, వాటిలో ఏ హీరోలు సరిపోతారో చెప్పిన చిరంజీవి!

 chiru participates in samjam
  • జగదేక‌వీరుడు, అతిలోకసుందరి సినిమాకి ‌రామ్‌చరణ్ లేక మహేశ్
  • ‘ఠాగూర్’ సినిమాకు పవన్ కల్యాణ్‌
  • ‘ఇంద్ర’కు  ప్రభాస్, ‘ఛాలెంజ్’కు అల్లు అర్జున్  
  • ‘ఆహా’ నిర్వహిస్తోన్న సామ్‌జామ్ షోలో చెప్పిన చిరు
నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన ‘ఆహా’ నిర్వహిస్తోన్న సామ్‌జామ్ షోలో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల పాల్గొన్న విషయం తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా ఈ షో ప్రసారమైంది. ఇందులో సమంతతో చిరు చాలా సరదాగా మాట్లాడారు. సమంత అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.

చిరంజీవి పాత సినిమాలను రీమేక్ చేస్తే ఆయా సినిమాల్లో హీరోలుగా ఎవరెవరు సరిపోతారని సామ్ అడిగింది. జగదేక‌వీరుడు, అతిలోకసుందరి సినిమాకి ‌రామ్‌చరణ్ లేక మహేశ్ బాబు సూట్ అవుతారని చిరు చెప్పారు. హీరోయిన్‌గా సమంత నటించాలని అన్నారు. గతంలో వచ్చిన ‘ఠాగూర్’ సినిమాకు పవన్ కల్యాణ్‌ హీరోగా సరిపోతాడని చెప్పారు.

ఇక  తాను నటించిన ‘ఇంద్ర’కు  ప్రభాస్, ‘ఛాలెంజ్’కు అల్లు అర్జున్ లేక విజయ్ దేవరకొండ, ‘గ్యాంగ్ లీడ‌ర్’కు  చెర్రీ లేక తారక్ సరిపోతారని చెప్పారు. తాను నటించిన ‘స్వయం కృషి’  సినిమాకు మాత్రం హీరోగా ఎవ్వరూ సరిపోలేరని చెప్పుకొచ్చారు. ఇందులో చిరంజీవి దోశ చాలెంజ్ అందరినీ బాగా అలరించింది.
Chiranjeevi
Tollywood
Samantha

More Telugu News