ఖమ్మంలో బీజేపీ నేత నేలవెళ్లి రామారావు దారుణ హత్య.. ఇంటికెళ్లి పొడిచి చంపిన దుండగుడు
- నాలుగుసార్లు పొట్టలో పొడిచిన దుండగుడు
- రక్తపు మడుగులో కుప్పకూలిన రామారావు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
రక్తపు మడుగులో కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన రామారావును వెంటనే 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.