మోదీ ప్రధానిగా ఉండగా ఏ కార్పొరేట్ శక్తీ రైతుల నుంచి భూమిని లాక్కోలేదు: అమిత్ షా
- ఎంఎస్పీ కొనసాగుతుంది, మండీలను మూసివేయబోం
- రైతు చట్టాలపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి
- రైతు సంక్షేమానికే మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్లోని ఏ ప్రొవిజన్ అయినా రైతులకు వ్యతిరేకంగా ఉందని రైతు సంఘాలు భావిస్తే చర్చించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎంఎస్పీపై ఒకటిన్నర రెట్లు అధికంగా ఇవ్వాలంటూ ఏళ్లుగా రైతులు చేస్తున్న డిమాండ్‌ను మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని, 2014-19 మధ్య దీనిని అమలు చేసిందని అమిత్ షా గుర్తు చేశారు. ఎంఎస్పీ కొనసాగుతుందని, మండీలను మూసివేయబోమని మరోమారు స్పష్టం చేస్తున్నట్టు చెప్పిన షా.. రైతుల సంక్షేమానికే మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.