Pawan Kalyan: రజనీకాంత్ కు రేపు మరిన్ని వైద్య పరీక్షలు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవన్ కల్యాణ్

Rajinikanth to undergo more tests tomorrow
  • బీపీ హెచ్చుతగ్గుల వల్ల అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్
  • పరామర్శించేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దన్న డాక్టర్లు
  • రజనీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవన్ కల్యాణ్
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రమైన బీపీ సమస్యతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు తాజా బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం రజనీ ఆరోగ్యం నిలకడగానే ఉందని బులెటిన్ లో వైద్యులు తెలిపారు. ఆయనకు రేపు మరిన్ని వైద్య పరీక్షలను నిర్వహిస్తామని వివరించారు. రజనీకి తోడుగా ఆయన కుమార్తె ఐశ్వర్య ఉన్నారని తెలిపారు. ఆయనను పరామర్శించేందుకు ఆసుపత్రికి ఎవరూ రావద్దని, ఆయన గదిలోకి ఎవరినీ అనుమతించడం లేదని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసేందుకు కూడా ఆసుపత్రికి ఎవరూ రాద్దని కోరారు.

మరోవైపు రజనీ అస్వస్థతకు గురయ్యారనే వార్తను విని ఎంతో బాధకు గురయ్యానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే కరోనా లక్షణాలు రజనీలో లేవని వైద్యులు చెప్పడం కొంత ఊరటనిచ్చిందని చెప్పారు. రజనీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాని తెలిపారు. ఆయన ఎంతో విశ్వసించే మహావతార్ బాబాజీ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా మన ముందుకు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. 
Pawan Kalyan
Janasena
Rajinikanth
Tollywood
Kollywood

More Telugu News