Varla Ramaiah: అయ్యా సవాంగ్ గారూ... ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా?: వర్ల రామయ్య

TDP leader Varla Ramaiah asks DGP about friendly policing
  • డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఉద్దేశించి వర్ల ట్వీట్
  • విపక్షాల ఆరోపణలు ఎందుకు పట్టించుకోరని ఆగ్రహం
  • డీజీపీ అలా చెప్పడం బాధ్యతారాహిత్యం అని విమర్శలు
  • పరోక్షంగా పోలీసులను రెచ్చగొట్టడమేనని వ్యాఖ్యలు  
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. 'అయ్యా సవాంగ్ గారూ, పోలీసులపై ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకోము..' అని చెప్పడం దారుణం అని విమర్శించారు. ప్రతిపక్షాల ఫిర్యాదులపై నిజానిజాలు వెలికితీస్తామని చెప్పవలసిన మీరు, ఆ ఆరోపణలను పట్టించుకోము అని అనడం బాధ్యతారాహిత్యమని ఆరోపించారు. మీ వ్యాఖ్యలతో పరోక్షంగా పోలీసులను ప్రతిపక్షాలపైకి రెచ్చగొట్టడమే కదా? అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీసింగ్? అని ప్రశ్నించారు.
Varla Ramaiah
AP DGP
Gautam Sawang
Friendly Policing

More Telugu News