Vijayasai Reddy: ప్రతి కుటుంబానికి ఓ ఫ్యామిలీ డాక్టర్... సీఎం జగన్ సాకారం చేస్తున్నారు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy talks about family doctor for every family in the state
  • ధనిక వర్గాల్లోనే ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ
  • ఇకపై అందరికీ అందుబాటులో కుటుంబ వైద్యుడు
  • సీఎం జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారన్న విజయసాయి
  • ఆరోగ్యమిత్ర, ఆశా వర్కర్ల సాయంతో ఫ్యామిలీ డాక్టర్ సేవలు
ధనిక కుటుంబాలకు ఫ్యామిలీ డాక్టర్ ఉండడం సాధారణమైన విషయం. అయితే ఇకపై ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ ను కలిగివుండడం అనేది ఇంక ఎంతమాత్రం ధనికులకు మాత్రమే పరిమితమైన అంశం కాదని పేర్కొన్నారు.

 రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని విజయసాయి వెల్లడించారు. తనకు కేటాయించిన జనాభా ఆరోగ్య వ్యవహారాలను ఇకపై ఈ ఫ్యామిలీ డాక్టర్లు ఆరోగ్యమిత్ర, ఆశా వర్కర్ల సాయంతో పర్యవేక్షిస్తుంటారని వివరించారు.
Vijayasai Reddy
Family Doctor
Andhra Pradesh
Jagan
YSRCP

More Telugu News