Pawan Kalyan: మహేశ్ బాబు-నమ్రత దంపతులకు క్రిస్మస్ కానుకలు పంపిన పవన్, అన్నా లెజ్నెవా

Pawan and Anna sends Christmas goodies to Mahesh Babu and Namrata
  • ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి
  • సన్నిహితులకు కానుకలు పంపుతున్న పవన్ దంపతులు
  • సంతోషంగా ఉండాలని ఆశిస్తూ మహేశ్ కు గిఫ్ట్ బాక్స్
  • ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించిన నమ్రత
  • పవన్, అన్నా దంపతులకు కృతజ్ఞతలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందోహం నెలకొంది. ఈ క్రమంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన అర్ధాంగి అన్నా లెజ్నెవా తమ సన్నిహితులందరికీ క్రిస్మస్ కానుకలు పంపుతున్నారు. ఇటీవలే వారు సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతలకు కూడా క్రిస్మస్ కానుకల బాక్సును పంపారు. అంతేకాదు, సంతోషంగా ఉండాలంటూ క్రిస్మస్ శుభ సందేశాన్ని కూడా వెలువరించారు. ఈ విషయాన్ని నమ్రత స్వయంగా వెల్లడించింది. తమకు క్రిస్మస్ కానుకలు పంపిన పవన్, అన్నా దంపతులకు నమ్రత కృతజ్ఞతలు తెలిపింది.
Pawan Kalyan
Anna Lezhneva
Mahesh Babu
Namrata
Christmas
Gift Box

More Telugu News