Mohan Babu: 'ఆచార్య' సెట్స్ పై మోహన్ బాబు ప్రత్యక్షం... మిత్రుడ్ని సాదరంగా ఆహ్వానించిన చిరంజీవి

Mohan Babu surprise visit to Chiranjeevi Acharya sets
  • హైదరాబాదులో 'ఆచార్య షూటింగ్
  • షూటింగ్ స్పాట్ కు విచ్చేసిన కలెక్షన్ కింగ్
  • మోహన్ బాబు రాక పట్ల చిరంజీవి హర్షం
  • ఇరువురి మధ్య మాటామంతీ
టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, మోహన్ బాబు తమ చెలిమిని మరోసారి ప్రదర్శించారు. మోహన్ బాబు ఇవాళ 'ఆచార్య' సెట్స్ పై ప్రత్యక్షమై చిరంజీవిని సర్ ప్రైజ్ చేశారు. 'ఆచార్య' తాజా షెడ్యూల్ హైదరాబాదులో జరుగుతుండగా మోహన్ బాబు విచ్చేశారు. మిత్రుడి రాకను చిరంజీవి స్వాగతించారు. సెట్స్ పైకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఇరువురి మధ్య కాసేపు మాటామంతీ నడిచింది. సినిమాల గురించి, ఇతర విషయాల గురించి చర్చించుకున్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'ఆచార్య' చిత్రంతో బిజీగా ఉండగా, మోహన్ బాబు 'సన్నాఫ్ ఇండియా' అనే సందేశాత్మక చిత్రంలో నటిస్తున్నారు.
Mohan Babu
Chiranjeevi
Acharya
Sets
Hyderabad

More Telugu News