KA Paul: జగన్ తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది: కేఏ పాల్

KA Paul slams YS Jagan with sensational comments
  • క్రిస్మస్ వేడుకలను జగన్ అడ్డుకున్నారు
  • నాతో పెట్టుకున్న ట్రంప్ కూడా ఓడిపోయాడు
  • గతంలో జగన్ కుటుంబం నా బ్లెస్సింగ్స్ తీసుకుంది

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కళ్లు నెత్తికెక్కాయంటూ ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మండిపడ్డారు. విశాఖలో నిర్వహించాలనుకున్న తమ క్రిస్మస్ వేడుకలను జగన్ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ప్రోటోకాల్ ను పాటిస్తూ 23 జిల్లాల నుంచి తాము కేవలం 230 మందిని మాత్రమే వేడుకలకు ఆహ్వానించామని చెప్పారు. అయితే తమ క్రిస్మస్ వేడుకలకు అధికారులు అనుమతిని నిరాకరించారని మండిపడ్డారు. దీనికి జగన్ తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

తనతో పెట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలలో ఓడిపోయారని చెప్పారు. తాను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తే... జగన్ స్పందించలేదని అన్నారు. గతంలో జగన్ కుటుంబ సభ్యులంతా తన వద్ద బ్లెస్సింగ్స్ తీసుకున్నారని చెప్పారు. రాజకీయ నాయకుల మాదిరి తాను వేల కోట్లు దోచుకోలేదని అన్నారు. క్రిస్మస్ సందర్భంగా తన వాక్యాన్ని మాత్రమే చెప్పాలనుకున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News