Anagani Satya Prasad: వైసీపీకి అనుకూలంగానే ప్రివిలేజ్ కమిటీ మీటింగ్ జరిగింది: టీడీపీ ఎమ్మెల్యే అనగాని

Privilege committee meeting went in favour of YSRCP says Anagani Prasad
  • అచ్చెన్న, రామానాయుడులపై ప్రివిలేజ్ కమిటీలో చర్చ
  • ఇద్దరికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయం
  • ఏకపక్షంగానే సమావేశాన్ని ముగించారన్న అనగాని

అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు సమావేశమైన ప్రివిలేజ్ కమిటీ ఈ అంశంపై చర్చించింది. టీడీపీ నేతలిద్దరికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. సమావేశానంతరం ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ జరిగిన విధంగానే ప్రివిలేజ్ కమిటీ సమావేశం కూడా జరిగిందని విమర్శించారు. ఏకపక్షంగానే సమావేశాన్ని ముగించారని అన్నారు.

సభా హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్, కమిటీ ఛైర్మన్ లకు ఉంటుందని అనగాని చెప్పారు. టీడీపీ ఇచ్చిన నోటీసులను కమిటీ అసలు పట్టించుకోలేదని మండిపడ్డారు. వైసీపీకి ఉపయోగపడే విధంగానే సమావేశం జరిగిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News