అరుణ్ జైట్లీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. క్రికెట్ అసోసియేషన్ సభ్యత్వాన్ని వదులుకున్న బేడీ!
- ఢిల్లీలోని కోట్లా మైదానంలో జైట్లీ విగ్రహం పెట్టాలని నిర్ణయం
- క్రికెటర్ల కంటే అడ్మినిస్ట్రేటర్లకే ప్రాధాన్యతను ఇస్తున్నారన్న బేడీ
- జైట్లీ విగ్రహాన్ని అంగీకరించలేనన్న క్రికెట్ దిగ్గజం
ఎంతో సహనం, క్షమాగుణం కలిగిన వ్యక్తినని తాను ఎంతో గర్వపడుతుంటానని... కానీ ఆ సహనం నశించే రోజులు వచ్చాయనే భయం ఇప్పుడు కలుగుతోందని అన్నారు. డీడీసీఏ తన సహనాన్ని పరీక్షించిందని, తాను ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని చెప్పారు. అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా అవినీతి చోటు చేసుకుందని... అలాంటి వ్యక్తి విగ్రహాన్ని స్టేడియంలో పెట్టేందుకు తాను అంగీకరించలేనని అన్నారు.
అరుణ్ జైట్లీ దాదాపు 14 ఏళ్ల పాటు డీడీసీఏ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ నేపథ్యంలో ఆయన గౌరవార్థం స్టేడియంలో ఆరు అడుగుల విగ్రహాన్ని నెలకొల్పాలని డీడీసీఏ నిర్ణయించింది. 2017లో స్టేడియంలోని ఒక స్టాండ్ కు ఆయన పేరు పెట్టారు. ఆయన కుమారుడు రోహన్ జైట్లీ ప్రస్తుతం డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నారు.