Xiaomi: యువకుడికి ఉచితంగా ఫోన్ పంపించిన షియోమీ... కారణం ఇదే!

Xiaomi gifts latest model phone to an ordent MI fan
  • ఎంఐ 10టీ ప్రో ఫోన్ విడుదల చేసిన షియోమీ 
  • ఆ ఫోన్ కొనేవరకు పెళ్లిచేసుకోనన్న యువకుడు
  • యువకుడి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న షియోమీ 
  • యువకుడి కోరిక తీరిన వైనం
  • పెళ్లికి సిద్ధమా? అంటూ ట్వీట్ చేసిన షియోమీ ఇండియా హెడ్
భారత్ లో షియోమీ ఫోన్లకున్న డిమాండ్ అంతాఇంతా కాదు. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో లభ్యమయ్యే షియోమీ భారత మార్కెట్ లో అగ్రగామిగా కొనసాగుతోంది. కాగా, కమల్ అహ్మద్ అనే యువకుడికి షియోమీ ఎంఐ 10టీ ప్రో ఫోన్ ను ఉచితంగా అందించింది. అందుకు గల కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కమల్ అహ్మద్ షియోమీ ఫోన్లకు వీరాభిమాని. ఇటీవలే షియోమీ ఎంఐ 10టీ ప్రో ఫోన్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆ ఫోన్ ను కొనేందుకు డబ్బులు పొదుపు చేస్తున్న కమల్... ఈ ఫోన్ ను కొనేవరకు తాను పెళ్లి చేసుకోబోనని ఫన్నీగా ట్వీట్ చేశాడు.

అయితే, ఈ ట్వీట్ ను షియోమీ పరిగణనలోకి తీసుకుంది. వెంటనే అతడు కోరుకున్న లేటెస్ట్ మోడల్ ఫోన్ ను ఉచితంగా పంపించింది. అనంతరం, షియోమీ ఇండియా అధిపతి మనుకుమార్ జైన్ స్పందిస్తూ... 'ఇప్పుడిక నువ్వు పెళ్లికి సిద్ధం అనుకుంటా!' అంటూ కొంటెగా ట్వీట్ చేశారు. ఈ ఉదంతం నెట్టింట వైరల్ గా మారింది.
Xiaomi
MI 1OT Pro
Kamal Ahmed
Marriage
Gift

More Telugu News