Kangana Ranaut: కంగనకు ఊరటనిచ్చిన బాంబే హైకోర్టు

Kangana has a right to hold twitter account says Mumbai Highcourt
  • కంగన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయాలని పిటిషన్
  • అది కుదరదని చెప్పిన హైకోర్టు
  • అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు అందరికీ ఉంటుందని వ్యాఖ్య
ఇటీవలి కాలంలో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌతన్ కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. కంగన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. ఖాతాను సస్పెండ్ చేయడం కుదరదని చెప్పింది.

కేసు వివరాల్లోకి వెళ్తే, ట్విట్టర్ వేదికగా జాతి వ్యతిరేక వ్యాఖ్యలను కంగన చేస్తోందని, తమ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ప్రవర్తించిందని అలీ ఖాసిఫ్ ఖాన్ అనే వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కంగనకు ఊరటను కల్పించింది.

కంగన ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయాలని తాము ఆదేశించలేమని హైకోర్టు తెలిపింది. ట్విట్టర్ లో ఎవరికైనా ఖాతా ఉండొచ్చని, అందులో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు అందరికీ ఉంటుందని చెప్పింది. జాతి వ్యతిరేక వ్యాఖ్యలకు, భావ ప్రకటన స్వేచ్ఛకు మధ్య చాలా తేడా ఉంటుందని తెలిపింది. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను జాతి వ్యతిరేక వ్యాఖ్యలని చెప్పలేమని వ్యాఖ్యానించింది. తీర్పును జనవరి 7న వెలువరిస్తామని చెప్పింది.
Kangana Ranaut
Bollywood
Mumbai Highcourt

More Telugu News