Sajjanar: ఫేక్ నోటీసులతో వినియోగదారులను బెదిరిస్తున్నారు: యాప్ లోన్ల అంశంపై సీపీ సజ్జనార్ వ్యాఖ్యలు

Sajjanar says loan app organisers annoying with fake legal notices
  • మనీ లోన్ యాప్ లపై కొరడా ఝుళిపించిన పోలీసులు
  • పలువురి అరెస్ట్
  • 35 శాతం అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారన్న సజ్జనార్
  • ఈ అంశాన్ని ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడి
  • గూగుల్ కు నోటీసులు ఇచ్చామని వివరణ
యాప్ ల సాయంతో ఆన్ లైన్ రుణాలు ఇస్తూ వినియోగదారులను పీల్చి పిప్పి చేయడమే కాకుండా, పలువురి ఆత్మహత్యలకు కారణమైన యాప్ లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. మోసపూరిత యాప్ నిర్వాహకులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాదులో ఆనియన్ క్రెడిట్ లిమిటెడ్, క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్ సంస్థలపై దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. రూ.1.52 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

ఆన్ లైన్ లో యాప్ ల ద్వారా రుణాలు తీసుకున్నవారి సంఖ్య దేశవ్యాప్తంగా 1.5 లక్షల వరకు ఉండగా, వారిలో 70 వేల మంది బాధితులేనని సజ్జనార్ అన్నారు. ఈ యాప్ ల నిర్వాహకులు 35 శాతం అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ దృష్టికి కూడా తీసుకెళ్లామని, నకిలీ లీగల్ నోటీసులతో వినియోగదారులను బెదిరిస్తున్నారని వివరించారు. ఇలాంటి యాప్ లకు ఎలా అనుమతి ఇచ్చారన్న విషయమై గూగుల్ కు నోటీసులు పంపామని సజ్జనార్ తెలిపారు.
Sajjanar
Loan Apps
Fake Legal Notice
RBI
Google

More Telugu News