Chiranjeevi: కళ్లకు గంతలు కట్టుకుని దోశ ఛాలెంజ్‌లో పాల్గొన్న చిరంజీవి.. ‘సామ్‌జామ్’ నుంచి మరో ప్రోమో విడుదల

chiru participates in dosha challenge
  • చిరుని ఇంటర్వ్యూ చేసిన సామ్
  • ఎప్పుడైనా సినిమా చూస్తూ ఏడ్చారా? అని ప్రశ్న
  • సరదాగా సమాధానం చెప్పిన చిరంజీవి
  • క్రిస్మస్‌కు షో ప్రసారం
‘ఆహా’ నిర్వహిస్తోన్న సామ్‌జామ్ షోలో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల పాల్గొన్న విషయం తెలిసిందే. క్రిస్మస్‌కు ఈ షో ప్రసారం కానుంది. ఈ షోకు సంబంధించిన మరో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో చిరు చాలా సరదాగా సమాధానాలు చెప్పారు.

ఎప్పుడైనా సినిమా చూస్తూ ఏడ్చారా? అని ఆయనను సమంత ప్రశ్నించింది. దీనికి జవాబు చెబుతూ, తాను గతంలో ఓ సినిమాకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నానని, కిందకు వంగి కన్నీరు తుడుచుకుంటున్న సమయంలో లైట్స్‌ వేశారని, ఆ సమయంలో తాను పైకి లేచేసరికి ఓ పైట తన చేతిలో ఉందని.. అంటూ ఇంకా ఏదో నవ్వుతూ చెప్పారు. గతంలో చిరంజీవి దోశ ఛాలెంజ్‌ లో పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ఫేవరేట్ దోశ ఛాలెంజ్ లో మరోసారి పాల్గొనాలని సమంత కోరింది.

దీంతో షోలో ఆయన కళ్లకు గంతలు కట్టుకుని దోశ ఛాలెంజ్‌ను చేసి చూపించారు. కాగా, చిరుకి వైవా హర్ష ఓ ప్రశ్న వేశాడు. ఒకవేళ మీ సినిమాలను రీమేక్ చేయాలంటే మీ పాత్రలను ఎవరు చేయగలరని ఆయన ప్రశ్నించాడు. చరణ్, తారక్, బన్నీ, రవితేజ, ప్రభాస్, విజయ్ దేవరకొండ, మహేశ్, పవన్ కల్యాణ్ అని చిరంజీవి అన్నారు. ఈ ప్రోమోలో చూసిన వాటిని పూర్తిగా చూడాలంటే ఆ షో చూడాల్సిందే!

 
Chiranjeevi
Samantha
aha
samjam

More Telugu News