Tamannaah: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

Thamanna plays Jvala Reddy role in Citeemar film
  • జ్వాలారెడ్డిగా వస్తున్న తమన్నా!  
  • 'రాజసింగం'గా నాగార్జున సినిమా
  • సంక్రాంతికి రామ్ 'రెడ్' పక్కా  
*  గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'సీటీమార్' చిత్రం నుంచి హీరోయిన్ తమన్నా లుక్ ను నిన్న ఆమె జన్మదినం సందర్భంగా రిలీజ్ చేశారు. ఇందులో ఆమె కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి పాత్రలో నటిస్తోంది. ఆమె జన్మదిన వేడుకను నిన్న సెట్లో యూనిట్ సభ్యులు నిర్వహించారు.
*  తొమ్మిదేళ్ల క్రితం నాగార్జున హీరోగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన 'రాజన్న' చిత్రాన్ని ఇప్పుడు తమిళంలోకి అనువదించారు. 'రాజసింగం' పేరిట డబ్ అయిన ఈ చిత్రాన్ని తమిళనాడులో ఈ నెల 25న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇందులో స్నేహ కథానాయికగా నటించింది.
*  యంగ్ హీరో రామ్ నటించిన 'రెడ్' చిత్రాన్ని సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఆ చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ నెల 24న థియేట్రికల్ ట్రయిలర్ ను రిలీజ్ చేస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేద పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ కథానాయికలుగా నటించారు.  
Tamannaah
Gopichand
Nagarjuna
Ram

More Telugu News