హైదరాబాదుకు చెందిన వ్యక్తిపై అమెరికాలో దుండగుల కాల్పులు
- నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం అమెరికాకు వెళ్లిన ముజీబుద్దీన్
- ఆదివారం తెల్లవారుజామున దుండగుల కాల్పులు
- తలకు తీవ్ర గాయం.. ఆసుపత్రిలో చికిత్స
ముజీబ్ తలకు తూటా తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం షికాగో యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు వైద్యులు తెలిపారు. మరో రెండుమూడు రోజుల్లో ఇంటికి వస్తానని మొన్ననే ఫోన్ చేసి చెప్పాడని, అంతలోనే ఇలా జరిగిందంటూ భార్య కౌసర్ కన్నీళ్లు పెట్టుకుంది.