Atchannaidu: ఇలాంటి వ్యక్తి ఇంకా మంత్రి పదవిలో కొనసాగుతుండటం సిగ్గుచేటు: మంత్రి అప్పలరాజుపై అచ్చెన్నాయుడు ఫైర్

Minister Atchannaidus comments are insulting says Atchannaidu
  • గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తామన్న వ్యాఖ్యలను అప్పల రాజు వెనక్కి తీసుకోవాలి
  • బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి
  • లేకపోతే మంత్రి కార్యక్రమాలను అడ్డుకుంటాం
మంత్రి సీదిరి అప్పలరాజుపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూల్చేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అన్నారు. లేని పక్షంలో మంత్రి కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. వైసీపీ నేతలు చదువుకున్న మూర్ఖుల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఒక మంత్రిగా ఉండి బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారని అన్నారు. ఇలాంటి వ్యక్తి  ఇంకా మంత్రి స్థానంలో కొనసాగుతుండటం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు.

వేల కోట్ల రూపాయలను దోచుకున్న జగన్ కు భజన చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని... కానీ, గౌతు లచ్చన్న గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం సహించబోమని అచ్చెన్నాయుడు అన్నారు. వంద మంది జగన్ లు వచ్చినా గౌతు లచ్చన్న విగ్రహానికి ఉన్న పెయింటింగ్ ను కూడా పీకలేరని అన్నారు.
Atchannaidu
Telugudesam
Appalaraju
Jagan
YSRCP

More Telugu News