Nara Brahmani: నారా బ్రాహ్మణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్

Lokesh birthday greetings to his better half Nara Brahmani
  • ఇవాళ నారా బ్రాహ్మణి పుట్టినరోజు
  • ఎంతో దృఢమైనదానివి అంటూ లోకేశ్ ట్వీట్
  • కష్టసుఖాల్లో వెంట నిలిచావంటూ వ్యాఖ్యలు
  • వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలన్న గోరంట్ల
ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న తన అర్ధాంగి నారా బ్రాహ్మణికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. "ఎంతో నిబ్బరంగా ఉంటావు, ఎంతో శ్రద్ధ చూపిస్తావు... అందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ ఓ మూలస్తంభంలా వెన్నంటే ఉన్నావు. హ్యాపీ బర్త్ డే బ్రాహ్మణి" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

అటు, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా బ్రాహ్మణికి బర్త్ డే విషెస్ తెలిపారు. వ్యాపార రంగంలో మరింతగా ఎదగాలని, ప్రజాక్షేత్రంలో అనేక విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ట్విట్టర్ లో స్పందించారు.
Nara Brahmani
Birthday
Nara Lokesh
Gorantla Butchaiah Chowdary
Telugudesam

More Telugu News