Jagan: సీఎం జ‌గ‌న్‌కు చంద్రబాబు సహా పలువురి శుభాకాంక్షలు

 May you be blessed with good health peace and a long life in public service says chandrababu ktr
  • నేడు వైఎస్ జ‌గ‌న్ పుట్టినరోజు  
  • ఆయురారోగ్యాలతో ఉండాలి: చంద్రబాబు
  • ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉండాలి అన్నా: కేటీఆర్
  • కొన్ని మొక్కలు నాటాలని కోరిన ఎంపీ సంతోష్ కుమార్
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్ గారూ.. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.  

మరోపక్క, జగన్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ‘గౌరనీయులైన ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ప్రజాసేవలో ఉంటూ, ఎల్లప్పుడు ఆరోగ్యంతో, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నా’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

జగన్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ రాజ్య‌స‌భ స‌భ్యుడు సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. ఆయన ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పుట్టినరోజు సందర్భంగా కొన్ని మొక్కలు నాటి ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని జగన్ ను సంతోష్ కోరారు.
Jagan
YSRCP
Chandrababu
KTR
santosh kumar

More Telugu News