Raghu Rama Krishna Raju: ఏపీ ఎంపీల్లో రఘురామకృష్ణరాజు నెంబర్ వన్... పార్లమెంటరీ బిజినెస్ ర్యాంకుల వెల్లడి

Raghurama Krishnaraju in Parliamentary Business rankingsragu
  • దేశంలోని ఎంపీల పనితీరు ఆధారంగా ర్యాంకులు
  • జాబితాలు విడుదల చేసిన పార్లమెంటరీ బిజినెస్
  • ఓవరాల్ గా రఘురామకు 40వ ర్యాంకు
  • ర్యాంకుల జాబితాలో మిథున్ రెడ్డి, నందిగం, బాలశౌరికి స్థానం
దేశంలోని ఎంపీల పనితీరు ఆధారంగా ప్రముఖ మీడియా వేదిక 'పార్లమెంటరీ బిజినెస్' ర్యాంకులు కేటాయించింది. తాజాగా వెల్లడించిన ఈ ర్యాంకుల్లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ ఎంపీలందరిలోనూ నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఓవరాల్ గా ఆయన పనితీరుకు గాను 40వ ర్యాంకు లభించింది. లోక్ సభలో కనబర్చిన ప్రదర్శన ప్రకారం ఆయనకు 53వ ర్యాంకు, నియోజకవర్గం వారీగా చూస్తే 72వ ర్యాంకు లభించాయి.

ఇక, పార్లమెంటరీ బిజినెస్ ర్యాంకుల్లో వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, నందిగం సురేశ్, వల్లభనేని బాలశౌరికి కూడా ర్యాంకులు లభించాయి. ఓవరాల్ పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే మిథున్ రెడ్డి 187, బాలశౌరి 237, నందిగం సురేశ్ 379వ ర్యాంకులో నిలిచారు.
Raghu Rama Krishna Raju
Rank
Parliamentary Business
Andhra Pradesh
Lok Sabha
YSRCP
India

More Telugu News