Durga: కువైట్ నుంచి వచ్చిన నా భార్య కనిపించడంలేదు: పోలీసులను ఆశ్రయించిన భర్త

Husband reports police that his wife gone missing in return of Kuwait
  • ఉపాధి కోసం కువైట్ వెళ్లిన దుర్గ
  • ఈ నెల 16న గన్నవరం రాక
  • ఎంతకీ ఇంటికి చేరని వైనం
  • ఆందోళనకు గురైన భర్త సత్యనారాయణ
  • సీసీ కెమెరా ఫుటేజ్ లో అస్పష్టత
  • దర్యాప్తు ముమ్మరం చేసిన గన్నవరం పోలీసులు
విదేశాల నుంచి వచ్చిన భార్య కనిపించకుండా పోయిందని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెలమూరుకు చెందిన సాలసత్తి దుర్గ (32) ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె ఈ నెల 16న కువైట్ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. కానీ దుర్గ ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త సత్యనారాయణ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

గన్నవరం ఎయిర్ పోర్టు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా, విమానం దిగిన తర్వాత టెర్మినల్ నుంచి వెలుపలికి వస్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే ఎయిర్ పోర్టు బయట ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆమె ఏ వాహనం ఎక్కింది? ఎటు వెళ్లింది? అనేదానిపై స్పష్టత లేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గన్నవరం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Durga
Kuwait
Gannavaram Airport
Missing
Police

More Telugu News