KCR: పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు.. ఆదేశాలు జారీ చేసిన కేసీఆర్

Registrations to be done in old system in Telangana
  • సోమవారం నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు
  • ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న సీఎం
  • రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా జరగాలని ఆదేశించిన కేసీఆర్
తెలంగాణలో రిజిస్ట్రేషన్లు మళ్లీ యథాతథంగా జరగనున్నాయి. సోమవారం నుంచి పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగబోతున్నాయి. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని ఆదేశించారు. కొత్త విధానం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు.

ఇకపై స్లాట్ బుకింగ్ లు అడగవద్దని.. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లను చేయాలని కేసీఆర్ అన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రం యథాతథంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని చెప్పారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు వ్యవహరించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొన్నాళ్ల పాటు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది.
KCR
TRS
Registrations
Telangana

More Telugu News