Vijayasai Reddy: మూడు రాజధానులు, స్థానిక ఎన్నికలపై విజయసాయిరెడ్డి తాజా వ్యాఖ్యలు!

Vijayasai Reddy comments on 3 capitals and local body elections
  • మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం
  • ప్రభుత్వం అనుకున్న సమయానికే స్థానిక ఎన్నికలు జరుగుతాయి
  • ప్రతి విషయాన్ని చంద్రబాబు నెగెటివ్ గానే చూస్తారు
మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అన్ని విధాలా సంప్రదింపులు జరిపి, సలహాలను తీసుకున్న తర్వాతే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఉంటాయని అన్నారు. కర్నూలులో శాసన రాజధాని ఉండాలనేది తమ ఆలోచన అని.. అయితే ఈ విషయం కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం అనుకున్న సమయానికే జరుగుతాయని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉందని... కోర్టులో తేలిన తర్వాత ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 21 నుంచి జనవరి 9 వరకు వైయస్సార్ కప్ క్రికెట్ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు.

 టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి విషయాన్ని వ్యతిరేక కోణంలోనే చూస్తారని మండిపడ్డారు. నిన్న ఒక పోలీసు కింద పడిపోయిన ఘటనను కూడా నెగెటివ్ గానే చిత్రీకరించారని అన్నారు. చంద్రబాబులో మూర్ఖత్వం, దుర్మార్గపు ఆలోచనలు పోనంత వరకు తెలుగుదేశం పార్టీ మనుగడ సాధించలేదని చెప్పారు.
Vijayasai Reddy
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News