Vallabhaneni Vamsi: చంద్రబాబు పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారు: వల్లభనేని వంశీ

Chandrababu is talking nonsense says Vallabhaneni Vamsi
  • రిఫరెండం అనేది ఇంత వరకు జరగనే లేదు
  • రాజధాని ఎక్కడుండాలనేది ప్రజలు నిర్ణయిస్తారు
  • టీడీపీ జాతీయ పార్టీ  ఎలా అవుతుంది?
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రిఫరెండం అనడం చూస్తుంటే... ఆయన వయసు మందగించిందనే విషయం మరోసారి బయటపడిందని అన్నారు. మన దేశంలో ఇప్పటి వరకు రిఫరెండం అనేది జరగనే లేదని చెప్పారు. అమరావతి రాజధాని ఏర్పాటు సమయంలో చంద్రబాబు రిఫరెండం కోరారా? అని ప్రశ్నించారు. పనికిమాలిన కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

రాజధాని ఎక్కడ ఉండాలనే విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. జాతీయ పార్టీ అంటే నాలుగు రాష్ట్రాల్లో సీట్లు ఉండాలని... కనీసం ఒక రాష్ట్రంలో కూడా సరిగా సీట్లు లేని టీడీపీ జాతీయ పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ విచారణ జరిపించి ఎలుకను పట్టుకోలేకపోయారని చంద్రబాబు అంటున్నారని... ఎలుకలు పట్టారా? పందికొక్కులను పట్టారా? అనే విషయం త్వరలోనే తెలుస్తుందని చెప్పారు.
Vallabhaneni Vamsi
YSRCP
Chandrababu
Telugudesam
Amaravati

More Telugu News