Tollywood: దిల్ రాజు పుట్టినరోజు వేడుకల్లో అగ్రహీరోల గ్రూప్ ఫొటో ఇదిగో!

Tollywood heroes attends Dil Raju birthday bash
షార్ట్స్‌లో చూడండి
అగ్రశ్రేణి నిర్మాత దిల్ రాజు నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన గతరాత్రి టాలీవుడ్ సినీ ప్రముఖులకు విందు ఏర్పాటు చేయగా, అనేకమంది అగ్రహీరోలు విచ్చేశారు. ఈ హీరోలతో దిల్ రాజ్ తీయించుకున్న గ్రూప్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోంది. ఎంతో అరుదైన కాంబినేషన్లన్నీ ఈ ఫొటోలో చూడొచ్చు. మధ్యలో దిల్ రాజు ఉండగా, అటూ ఇటూ రామ్ చరణ్, మహేశ్ బాబు నిల్చున్నారు. మహేశ్ పక్కనే ప్రభాస్, అటు రామ్ చరణ్ పక్కన రామ్, విజయ్ దేవరకొండ ఉన్నారు. చివర్లో ప్రభాస్ పక్కన నాగచైతన్య ఉన్నాడు. ఈ ఫొటో అందరు హీరోల అభిమానులను విశేషంగా అలరిస్తోంది.
Go Back to Shorts
Tollywood
Heroes
Dil Raju
Birthday
Group Photo

More Telugu News