జనవరిలో పెళ్లి ఉండొచ్చా? అనే ప్రశ్నకు సింగర్ సునీత స్పందన!
- మాది పెళ్లి కాదన్న సునీత
- ఇది రెండు కుటుంబాల కలయిక
- జనవరిలో పెళ్లి ఉండొచ్చు
తాజాగా హైదరాబాదులోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం ముఖ్య అతిథులుగా హీరోయిన్లు రాశీఖన్నా, అనుపమ పరమేశ్వరన్ లతో కలిసి సునీత కూడా వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. తనది పెళ్లి కాదని... రెండు కుటుంబాల కలయిక అని అన్నారు. జనవరిలో పెళ్లి ఉండొచ్చా? అనే ప్రశ్నకు బదులుగా ఉండొచ్చని చెప్పారు.