Nara Lokesh: వైసీపీ ఎమ్మెల్యే ఓ మహిళను వేధించి బలితీసుకున్నారు: నారా లోకేశ్

Woman commits suicide after YSRCP MLAs torture tweets Nara Lokesh
  • జగన్ పాలనలో రక్షణ లేకుండా పోతోంది
  • ఇంటికి వెళ్లే దారిని మూసి మహిళను వేధించారు
  • ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి
జగన్ పాలనలో ప్రజలకు రక్షణే లేకుండా పోతోందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక డాక్టర్ గా ప్రాణాలు కాపాడాల్సిన అనపర్తి ఎమ్మెల్యే... వేధింపులకు గురి చేసి మహిళను బలితీసుకున్నారని మండిపడ్డారు. వారు పంచిన రూ. 2 వేలు కూడా తీసుకోకుండా వైసీపీకి ఓటు వేసినందుకు... తమ ఇంటికి వెళ్లే దారిని మూయించి వేధించారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసి అరుణకుమారి బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటన తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు. వైసీపీ నాయకులు రాక్షసుల్లా మారి ప్రజల్ని మింగేస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి దీనికి కారణమైన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Nara Lokesh
Telugudesam
YSRCP
Woman
Suicide

More Telugu News