పదేళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పేసిన నటి పూజాగౌర్
- తమ మధ్య విభేదాలున్నట్టు గతేడాది ప్రకటించిన పూజ
- విడిపోయినట్టు వస్తున్న వార్తలు నిజమేనని స్పష్టీకరణ
- విడిపోయినా మంచి స్నేహితుల్లా ఉంటామన్న పూజ
రాజ్‌తో తనకున్న రిలేషన్ గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటున్నారని పేర్కొన్న నటి.. తామిద్దరం విడిపోవాలని పరస్పరం నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఇక నుంచి ఎవరి జీవితం వారిదే అయినప్పటికీ తమ మధ్య ఇంతకాలం ఉన్న ప్రేమాభిమానాలు, ఒకరంటే మరొకరికి గౌరవం జీవితాంతం ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇకపై తామిద్దరం మంచి స్నేహితులమని, ఈ విషయంలో ఎప్పటికీ మార్పు ఉండబోదని పూజాగౌర్ పేర్కొన్నారు.