Nara Lokesh: జగన్ రెడ్డీ... ఆ సవాల్ కు స్పందించాల్సింది నువ్వే!: నారా లోకేశ్

Nara Lokesh asks CM Jagan do accept Chandrababu challenge
  • మూడు రాజధానులపై రిఫరెండం సవాల్ విసిరిన చంద్రబాబు
  • కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని
  • స్పందించాల్సింది ఊరకుక్కలు కాదన్న నారా లోకేశ్
  • జనభేరితో జగన్ కు మబ్బులు విడిపోయాయని వ్యాఖ్యలు
  •  అన్ని పార్టీలు అమరావతికి జై కొట్టాయని వెల్లడి
రాయపూడిలో నిర్వహించిన జనభేరి సభలో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలతో సీఎం జగన్ కు సవాల్ విసరడం, దానిపై వైసీపీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ఈ అంశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. మూడు ముక్కలాటకు కట్టుబడిన జగన్ రెడ్డికి చంద్రబాబు రిఫరెండం సవాల్ విసిరారని లోకేశ్ వెల్లడించారు.

ఆ సవాల్ ను స్వీకరించే దమ్ముందా జగన్ రెడ్డీ? అంటూ గట్టిగా ప్రశ్నించారు. చంద్రబాబు చాలెంజ్ కు స్పందించాల్సింది నువ్వే... నీ గేటు దగ్గర ఊరకుక్కలు కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనభేరితో జగన్ కు మబ్బులు విడిపోయాయని... ప్రజలు, ప్రాంతాలు, పార్టీలు ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అంటూ అమరావతికి జై కొట్టాయని జనభేరితో తేలిపోయిందని లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
Jagan
Chandrababu
Challenge

More Telugu News