Vijayashanti: నా దూకుడులో ఏ మార్పు ఉండదు: విజయశాంతి

Vijayasanthi talks to a media channel
  • ఇటీవలే బీజేపీలో చేరిన విజయశాంతి
  • తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నట్టే ఇప్పుడూ ఉంటానని వెల్లడి
  • ప్రజలు కోరుకున్నది సాధించడమే తన లక్ష్యమని వివరణ
  • టీఆర్ఎస్ ప్రజల కోసం పనిచేయడంలేదని ఆరోపణ
  • ఇటీవల ఎన్నికల్లో ఫలితాలే అందుకు నిదర్శనమని వ్యాఖ్యలు
ఇటీవలే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తాను ఎలా ఉన్నానో, ఇప్పుడు బీజేపీలోనూ అలాగే ఉంటానని వెల్లడించారు. తన దూకుడులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఏంకావాలో అది రాబట్టుకోవాలన్నదే తన లక్ష్యమని, దానికోసమే తన పోరాటమని వివరించారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పోరాడడం లేదు కాబట్టే వారిని తాను నిలదీస్తున్నానని చెప్పారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, డబుల్ బెడ్రూం ఇళ్ల నాణ్యత నాసిరకంగా ఉందని, కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. సర్కారు అవినీతిమయం అయిందని, యథా రాజా తథా ఎమ్మెల్యేలు అన్నట్టుగా ముఖ్యమంత్రే అవినీతికి పాల్పడుతుంటే, ఎమ్మెల్యేలు ఎందుకు అవినీతి చెయ్యకుండా ఉంటారని విజయశాంతి ప్రశ్నించారు. ప్రజల తరఫున పోరాడుతోంది బీజేపీనే అని ఇటీవలి ఎన్నికల ద్వారా రుజువైందని, టీఆర్ఎస్ పనితీరు ఏంటో తేలిపోయిందని అన్నారు.
Vijayashanti
TRS
BJP
Elections
Telangana

More Telugu News