Farmers: చలికి తట్టుకోలేక.. ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న రైతు మృతి

Punjab Farmer Protesting Near Delhi Border Dies Amid Cold Wave
  • ఉత్తరాదిని వణికిస్తున్న చలి గాలులు
  • భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • ఇప్పటి వరకు 20కి పైగా రైతుల మృతి
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉదయం ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీవ్రమైన చలికి తట్టుకోలేక పంజాబ్ కు చెందిన ఓ రైతు చనిపోయాడు. ఉత్తరాదిన విపరీతమైన చలిగాలులు వీస్తున్నాయి. గజగజ వణికిస్తున్న చలికి తట్టుకోలేక ఇప్పటి వరకు 20 మందికి పైగా రైతులు మృత్యువాత పడ్డారు. గత కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోయాయి. మరోవైపు ధర్నా స్థలి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. చలిమంటలు వేసుకుంటూ ధర్నాను కొనసాగిస్తున్నారు. కొన్ని ఎన్జీవోలు వీరికి హీటర్లు, దుప్పట్లను పంపిణీ చేస్తున్నాయి.
Farmers
Delhi
Dead

More Telugu News