Uttar Pradesh: పెళ్లి పార్టీలో మందు తక్కువైందట... వరుడిని హత్య చేసిన మిత్రులు!

Bride Murdered over Aditional Liquor Rift with Friends
  • ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన
  • పెళ్లి తరువాత స్నేహితులకు విందు
  • పలకరించేందుకు వెళ్లగా మరింత మద్యం కోసం వివాదం
  • కేసును విచారిస్తున్న పోలీసులు
పెళ్లి చేసుకుని పార్టీని ఇస్తూ, చాలినంత మద్యం తెప్పించలేదన్న ఆగ్రహంతో వరుడిపై కత్తితో దాడి చేసి చంపిన ఘటన యూపీలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం పాలిముకిల్ పూర్ కు చెందిన బబ్లూకు సోమవారం రాత్రి వివాహం జరుగగా, ఆపై స్నేహితుల కోసం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశాడు. వారంతా విందులో ఉండగా, పలకరించి రావాలని వెళ్లాడు. అప్పటికే పూటుగా తాగివున్న మిత్రబృందం మరింత మద్యం కావాలని అడిగారు.

తాగినంత వరకూ చాలని, ఇంకా ఎక్కువగా తాగవద్దని బబ్లూ కోరడంతో వివాదం మొదలైంది. దాంతో విచక్షణ కోల్పోయిన స్నేహితులు బబ్లూపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో బబ్లూ తీవ్రంగా గాయపడగా, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించాడని వైద్యులు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసును నమోదు చేసి, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రామ్ ఖిలాడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు ఫ్రెండ్స్ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
Uttar Pradesh
Bride
Murder
Liquor

More Telugu News