Vijay Devarakonda: సుకుమార్, విజయ్ దేవరకొండ మూవీ అప్ డేట్!

Sukumar to direct Vijay devarakonda
  • సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 
  • భారత్, పాక్ యుద్ధం నేపథ్యంలో సాగే కథ
  • పవర్ ఫుల్ సోల్జర్ పాత్రలో విజయ్
  • పుష్ప తర్వాత సుకుమార్ చేసే చిత్రం  
ఈవేళ యూత్ లో మంచి క్రేజ్ వున్న హీరోగా విజయ్ దేవరకొండ పేరు చెప్పుకోవాలి. 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ తెచ్చుకుని యువతకు మెచ్చే కథలతో ముందుకు సాగుతున్నాడు. అతని యాక్టింగ్ స్టయిల్.. డైలాగ్ డెలివరీ యూత్ కి బాగా నచ్చుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే పాన్ ఇండియా మూవీని చేస్తున్న విజయ్ ఇటీవలే సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.

ఈ సినిమా గురించి అప్ డేట్ ఒకటి వచ్చింది. ఇది పీరియాడిక్ మూవీగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. భారత్, పాకిస్థాన్ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో నడిచే కథతో ఈ చిత్రం తెరకెక్కుతుందట. ఇందులో విజయ్ దేవరకొండ సోల్జర్ గా ఓ పవర్ ఫుల్ పాత్రను పోషించనున్నట్టు సమాచారం.

ప్రస్తుతం అల్లు అర్జున్ తో తాను చేస్తున్న 'పుష్ప' సినిమా పూర్తయ్యాక సుకుమార్ ఈ ప్రాజక్టును ప్రారంభిస్తారని అంటున్నారు. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్టుతో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.  
Vijay Devarakonda
Sukumar
Allu Arjun

More Telugu News