Samanta: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Samantha joins Tamil film shoot
  • తమిళ సినిమా షూటింగులో సమంత 
  • రామోజీ ఫిలిం సిటీలో మణిరత్నం షూటింగ్
  • ఓటీటీ ద్వారానే 'ఉప్పెన' విడుదల
*  నయనతార, సమంత కలసి ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగులో సమంత నిన్న జాయిన్ అయింది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న 'పొన్నియన్ సెల్వన్' చిత్రం తాజా షెడ్యూలును జనవరి 10 నుంచి హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని ప్రత్యేకమైన సెట్స్ కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది.
*  చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న 'ఉప్పెన' చిత్రం పూర్తయినప్పటికీ, లాక్ డౌన్ కారణంగా విడుదల ఆగిపోయింది. ఇక థియేటర్లలోనే విడుదల చేస్తారని అనుకున్నప్పటికీ, తాజాగా నిర్మాతలు హక్కులను ఓటీటీ సంస్థకు ఇచ్చేసినట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో ఓటీటీ ద్వారా ఇది రిలీజ్ అవుతుందని సమాచారం. ఇందులో కృతిశెట్టి కథానాయికగా నటించింది. 
Samanta
Nayanatara
Maniratnam
Vaishnav Tej

More Telugu News