Amit Shah: ఢిల్లీకి చేరుకున్న జగన్.. కాసేపట్లో అమిత్ షాతో భేటీ!

AP CM Jagan reaches Delhi
  • విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న జగన్
  • పోలవరం ప్రాజక్టు సవరించిన అంచనాలపై అమిత్ షాతో చర్చించే అవకాశం
  • ప్రధాని మోదీతో సమావేశంపై ఇంకా రాని క్లారిటీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. ప్రధాని మోదీని కలవడంపై ఇంత వరకు స్పష్టత రాలేదు.

మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు పలికింది. బంద్ జరిగిన 8వ తేదీన మధ్యాహ్నం వరకు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసింది. దీనికి సంబంధించిన అంశం కూడా అమిత్ షాతో భేటీ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టుపై సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరనున్నట్టు సమాచారం.
Amit Shah
BJP
Jagan
YSRCP
Delhi

More Telugu News