Ramcharan: 'ఆచార్య'లో రామ్ చరణ్ గెస్ట్ కాదట!

Ram Charan plays full length role in Acharya
  • కొరటాల దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య'
  • చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడంటూ ప్రచారం
  • చిరంజీవి పాత్రతో సమానంగా సాగే పాత్రే
  • వచ్చే నెలలో షూటింగులో చేరే చరణ్  
చిరంజీవి, రామ్ చరణ్.. ఈ తండ్రీకొడుకులిద్దరూ కలసి ఓ పూర్తి స్థాయి సినిమా చేస్తే ఎలా ఉంటుంది? మెగా అభిమానులకు ఇక పండగే కదా! ఇప్పుడిలాంటి చిత్రాన్ని చూసే అవకాశం త్వరలో అభిమానులకు కలగనుంది. ఈ తండ్రీతనయులు కలసి 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. ఇది పాత వార్తే అయినప్పటికీ.. ఇందులోనే కాస్త కొత్తదనం కూడా వుంది.

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'ఆచార్య' సినిమాలో చరణ్ గెస్ట్ పాత్ర పోషిస్తున్నట్టు ఇన్నాళ్లూ ప్రచారం జరిగింది. అయితే, ఇది గెస్ట్ పాత్ర కాదనీ, పూర్తి స్థాయి పాత్ర అనీ తాజాగా తెలుస్తోంది. అంటే చరణ్ పోషించే పాత్ర చిన్న పాత్ర కాదనీ, చిరంజీవి పాత్ర నిడివికి సమానంగా ఇది కూడా ఉంటుందనీ అంటున్నారు.  

లాక్ డౌన్ వల్ల ఏర్పడిన విరామం తర్వాత ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే హైదరాబాదులో మొదలైంది. ఈ రోజున కథానాయిక కాజల్ కూడా షూటింగులో జాయిన్ అయింది. ఇక ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ చేస్తున్న చరణ్.. త్వరలోనే దానిని పూర్తి చేసుకుని సంక్రాంతి తర్వాత నుంచి 'ఆచార్య' షూటింగులో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఇందులో అతని సరసన నటించే హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు.
Ramcharan
Chiranjeevi
Kajal Agarwal
Koratala Siva

More Telugu News