Chandrababu: ఆయన సాధించి పెట్టిన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు రాజధాని లేకుండా పోయింది: చంద్రబాబు

chandra babu slams ycp
  • తెలుగు వారికి రాష్ట్రం సాధించడం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేశారు
  • ఇదే రోజున అమరులయ్యారు
  • అహింసాయుత పోరాటం స్ఫూర్తిగా అమరావతిని సాధించుకోవాలి
  • అప్పుడే ఆ అమరజీవి ఆత్మకు శాంతి  
అమరజీవి పొట్టి శ్రీరాములు సాధించి పెట్టిన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు రాజధాని లేకుండా పోయిందంటూ టీడీపీ నేత చంద్రబాబు నాయుడు పరోక్షంగా వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చంద్రబాబు దీనిపై స్పందిస్తూ... ‘తెలుగు వారికి ఒక రాష్ట్రం సాధించడం కోసం 58 రోజుల ఆమరణ దీక్ష చేసి ఇదే రోజున అమరులయ్యారు పొట్టి శ్రీరాములుగారు. ఆయన సాధించి పెట్టిన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు రాజధాని లేకుండా పోయింది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

‘నాడు పొట్టి శ్రీరాములు గారు చేసిన అహింసాయుత పోరాటం స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని సాధించుకున్ననాడే ఆ అమరజీవి ఆత్మకు శాంతి చేకూరుతుంది. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆ త్యాగధనుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను’ అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. 
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News