United Airlines: మాస్క్ పెట్టుకోనని మారాం చేసిన చిన్నారి.. విమానం నుంచి ఆ ఫ్యామిలీని దింపేసిన సిబ్బంది... వైరల్ అవుతున్న వీడియో!

United Airlines Kicked out Family over Mask of Two Year Child
  • యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో ఘటన
  • నిర్దయగా విమానం నుంచి దింపేసిన సిబ్బంది
  • తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నామన్న ఫ్యామిలీ 
యూఎస్ కు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలోని సిబ్బంది అత్యంత ఘోరంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, వేలాది మంది ఎయిర్ లైన్స్ వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకీ అసలేమైందంటే, ఎలిజ్ అర్భన్ అనే యువతి, తన భర్త, రెండు సంవత్సరాల బిడ్డతో కలిసి యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించేందుకు విమానం ఎక్కింది.

ఆపై విమానంలో తాము అత్యంత అవమానాన్ని ఎదుర్కొన్నామని, ఏ మాత్రం కనికరం లేకుండా తమను బలవంతంగా దించేశారని, ఆపై జీవితాంతం తాము యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించకుండా నిషేధం విధించారని ఎలిజ్ కన్నీరు పెట్టుకుంది. ఆపై విమానంలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.

విమానంలో మాస్క్ పెట్టుకోవాలన్న నిబంధన ఉండగా, రెండేళ్ల పాప, తనకు మాస్క్ వద్దని మారాం చేసింది. పాప తండ్రి ఎంతగా బలవంతం చేసినా, ఆ బిడ్డ వినలేదు. ఇంతలో విమానం సిబ్బంది ఒకరు వచ్చి, పాపను తీసుకుని కిందకు దిగాలని సూచించాడు. తాను బిడ్డ ముఖంపై మాస్క్ ను ఉంచానని, పాప కొంత మారాం చేస్తుందని, కాసేపట్లో సర్దుకుంటుందని చెప్పి చూశాడు. కానీ విమానం సిబ్బంది వినలేదు. చివరకు విమాన సిబ్బంది బలవంతం చేయడంతో వారు కిందకు దిగాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన వారంతా యునైటెడ్ ఎయిర్ లైన్స్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
United Airlines
Mask
Child

More Telugu News