Bollywood: కరోనా నుంచి కోలుకుని పక్షవాతానికి గురైన నటి శిఖా మల్హోత్రా

Bollywood actress Shikha Malhotra hospitalised
  • నర్సింగ్ విద్యను అభ్యసించి సినీరంగంలోకి
  • తిరిగి నర్సుగా మారి కొవిడ్ రోగులకు సేవలు
  • కరోనా నుంచి కోలుకున్నంతలోనే స్ట్రోక్
నర్సింగ్ విద్యను అభ్యసించి ఆ తర్వాత ఎంతో ఇష్టమైన సినీ రంగంలోకి ప్రవేశించిన బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా పక్షవాతానికి గురయ్యారు. కొవిడ్ బారినపడి ఆసుపత్రి పాలవుతున్న వారి కోసం తిరిగి నర్స్‌గా అవతారమెత్తిన శిఖ ఎంతోమందికి సేవలు అందించి ఆదర్శంగా నిలిచారు. ఈ క్రమంలో ఆమె కూడా కరోనా బారినపడి ఆ మహమ్మారితో పోరాడారు. విజయం సాధించి ఇంటికి చేరుకున్నారు. ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపించిన ఆమె ఇటీవల పక్షవాతానికి గురైనట్టు తెలిసి అభిమానులు ఒకింత షాక్‌కు గురయ్యారు.

ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శిఖ పక్షవాతానికి గురైనట్టు ఆమె మేనేజర్ అశ్విన్ శుక్లా తెలిపారు. ఆమె ఫొటోను పోస్టు చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. శిఖ కుడివైపు స్ట్రోక్ వచ్చిందని, ప్రస్తుతం ఆమె కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. కాగా, బాలీవుడ్‌లోకి ప్రవేశించిన శిఖ పలు సినిమాల్లో నటించారు. షారూఖ్‌తో కలిసి ‘ఫ్యాన్’ సినిమాలో నటించారు. ఆ సినిమా శిఖాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
Bollywood
Shikha Malhotra
stroke
paralysis

More Telugu News