Pawan Kalyan: నడ్డా త్వరగా కోలుకోవాలని బాలాజీని ప్రార్థిస్తున్నా: పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes JP Naddas speedy recovery
  • కరోనా బారిన పడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
  • హోం ఐసొలేషన్ లో ఉన్నానని ట్వీట్
  • త్వరలోనే ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షించిన పవన్ కల్యాణ్
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా సోకిందనే విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసొలేషన్ లో ఉన్నానని తెలిపారు.

ఈ నేపథ్యంలో, నడ్డా త్వరగా కోలుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. త్వరగా కోలుకోవాలని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. 'మీరు త్వరలోనే మళ్లీ ప్రజా జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాను సార్, అని ట్వీట్ చేశారు. పశ్చిమబెంగాల్ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత నడ్డాలో కరోనా లక్షణాలు కనిపించాయి.
Pawan Kalyan
Janasena
JP Nadda
BJP

More Telugu News