Mamata Banerjee: కేంద్ర బలగాలను దింపితేనే బెంగాల్‌లో హింసకు అడ్డుకట్ట: బీజేపీ

kailash vijayvargiya says central forces must deploy in west bengal
  • మమత మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు హింసను ప్రోత్సహిస్తున్నారు
  • పరిస్థితులు తన చేయిదాటిపోయాయని ఆమెకు తెలుసు
  • కేంద్ర బలగాలను దింపాలని ఈసీని కోరా
పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట వేయాలంటే వెంటనే కేంద్ర బలగాలను దింపాల్సిందేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ అన్నారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు మమతాబెనర్జీ హింసాత్మక ఘటనలను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిన్న భీర్భూమ్‌లోని శాంతినికేతన్ వద్ద విలేకరులతో  మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలోని పరిస్థితులు తన చేయిదాటిపోయాయని మమతకు తెలుసని, అందుకే ఆమె ఇలాంటి హింసాత్మక ఘటనలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి హింసకు తావులేకుండా వాటిని నిర్వహించేందుకు కేంద్ర బలగాలను దింపాలని తాను ఈసీని కోరినట్టు చెప్పారు.
Mamata Banerjee
West Bengal
kailash vijayvargiya
BJP
TMC

More Telugu News