JP Nadda: బీజేపీ రథసారథి జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్

BJP National Chief JP Nadda tested corona positive
  • దేశంలో ఇంకా తగ్గని కరోనా ప్రభావం
  • తనకు ప్రాథమిక లక్షణాలు కనిపించాయన్న జేపీ నడ్డా
  • కరోనా టెస్టు చేయించుకున్నానని వెల్లడి
  • స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని వివరణ
  • తనను కలిసిన వాళ్లు ఐసోలేషన్ లో ఉండాలని సూచన
దేశంలో కరోనా మహమ్మారి ఇంకా ప్రభావం చూపుతూనే ఉంది. తాజాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టు చేయించుకున్నానని, పాజిటివ్ అని తేలిందని తెలిపారు. అయితే తాను బాగానే ఉన్నానని, డాక్టర్ల సలహా మేరకు అన్ని మార్గదర్శకాలు పాటిస్తూ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నానని జేపీ నడ్డా వివరించారు. గత కొన్నిరోజులుగా తనను కలిసి వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు.

కాగా, జేపీ నడ్డాకు కరోనా సోకిన విషయంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి కరోనా పాజిటివ్ అనే విషయం తనకు తెలిసిందని, కొవిడ్ నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని భద్రకాళి అమ్మవారిని వేడుకుంటున్నానని ట్వీట్ చేశారు.
JP Nadda
Corona Virus
Positive
Isolation
BJP

More Telugu News