KCR: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... తెలంగాణలో ఉపాధ్యాయ, పోలీసు నియామకాలకు త్వరలో నోటిఫికేషన్లు

CM KCR orders to collect job vacancies in all departments
  • ఉద్యోగ ఖాళీలపై సీఎం కేసీఆర్ సమీక్ష
  • ఇతర విభాగాల్లోనూ త్వరలో నోటిఫికేషన్లు
  • ఖాళీల లెక్క తేల్చాలని సీఎం ఆదేశాలు
  • మొత్తం ఖాళీల  లెక్క తేలితే వరుసగా నోటిఫికేషన్లు
  • వివిధ శాఖల్లో 50 వేల వరకు ఖాళీలు!
టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే తెలంగాణలో ఉపాధ్యాయ, పోలీసు నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అవే కాకుండా, ఇతర విభాగాల్లోనూ ఖాళీల ఆధారంగా మరికొన్ని నోటిఫికేషన్లు జారీ చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.

కాగా, రాష్ట్రంలో వివిధ శాఖల్లో కలిపి సుమారు 50 వేల వరకు ఖాళీలు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం ఉందని, వేల సంఖ్యలో ఉపాధ్యాయ, పోలీసు రిక్రూట్ మెంట్ జరగాల్సి ఉందని, ఇతర శాఖల్లోని ఖాళీలను కూడా భర్తీ చేస్తామని సీఎం పేర్కొన్నారు. ఇంకా మరికొన్ని శాఖల్లో ఎంతమంది ఉద్యోగులు అవసరమన్నది తేల్చాలని, మొత్తం ఖాళీలు లెక్కతేలిన వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని సీఎం కేసీఆర్ తన ఆదేశాల్లో స్పష్టం చేశారు.
KCR
Jobs
Recruitment
Notifications
Telangana

More Telugu News