భారత నేవీ సిబ్బంది విన్యాసాలు చూస్తే మతిపోతుంది... వీడియో ఇదిగో!
- క్రమశిక్షణకు మారుపేరుగా త్రివిధ దళాలు
- నైపుణ్యం పరంగా ప్రపంచంలో ఎవరికీ తీసిపోని వైనం
- కాగడాలతో గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించిన భారత నేవీ సిబ్బంది
- పరస్పరం కాగడాలు మార్చుకుంటూ విన్యాసాలు
- మధ్యలోంచి నడుచుకుంటూ వచ్చిన నేవీ అధికారి
- వీడియో వైరల్
చేతుల్లో కాగడాలతో ఎదురెదురుగా నిల్చున్న కొందరు నేవీ సిబ్బంది తమ చేతిలో ఉన్న కాగడాను ఎదుటి వ్యక్తికి విసిరేస్తూ, ఎదుటి వ్యక్తి విసిరిన కాగడాను తాము అందుకుంటూ ప్రతిభను చాటారు. అంతకంటే ముఖ్యంగా, వారు అలా కాగడాలు మార్చుకునే సమయంలో మధ్యలో ఓ అధికారి నడుచుకుంటూ రావడం, అతనికి ఒక్క కాగడా కూడా తగలకపోవడం హైలైట్ అని చెప్పాలి.