కాల్పులతో దద్దరిల్లిన ఆంధ్రా-ఒడిశా బోర్డర్... ఇద్దరు మావోల మృతి
- ఏవోబీలో మళ్లీ కాల్పుల కలకలం
- సింగారం అటవీప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్
- సాయుధ బలగాలకు ఎదురుపడిన నక్సల్స్
- ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు
- మృతుల్లో ఒకరు మహిళా మావోయిస్టు
సింగారం అటవీప్రాంతంలో ఒడిశా వలంటీర్ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోలు తారసపడ్డారు. దాంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. కాగా, మృతిచెందిన మావోయిస్టుల్లో ఓ మహిళ కూడా ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.