CM Ramesh: తెలంగాణలో గెలిచాం.. ఏపీలో కూడా గెలవాలి: సీఎం రమేశ్

BJP has to win in AP says CM Ramesh
  • ఏపీ బీజేపీ నేతలు సొంత అజెండాలు పక్కన పెట్టాలి
  • పార్టీ ఉన్నతి కోసం పని చేయాలి
  • మనపై కేసులు పెడితే.. వైసీపీ నేతలపై కేసులు పెట్టండి
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపైనే కామెంట్లు చేశారు. నాయకులు వారి సొంత అజెండాలను పక్కన పెట్టి, పార్టీ ఉన్నతి కోసం పని చేయాలని హితవు పలికారు. ప్రజల అజెండాతో అందరూ ముందుకు వెళ్లాలని అన్నారు.

దేశంలో ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా బీజేపీనే గెలుస్తోందని.. చివరకు పక్క రాష్ట్రం తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో సైతం బీజేపీ గెలిచిందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం బీజేపీ సత్తా చాటిందని అన్నారు. తిరుపతిలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో సైతం బీజేపీ గెలుపు దిశగా పయనించాలని సీఎం రమేశ్ అన్నారు. దేశ వ్యాప్తంగా నరేంద్రమోదీ గాలి వీస్తోందని చెప్పారు. బీజేపీ నాయకులపై వైసీపీ కేసులు పెడితే... వాళ్లపై మనం కూడా తిరిగి కేసులు పెట్టాలని అన్నారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టేందుకు అవసరమైన మెటీరియల్ అందరి వద్ద ఉందని చెప్పారు.
CM Ramesh
BJP
and
Narendra Modi

More Telugu News