Rajinikanth: రజనీకాంత్‌కు మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు

Modi wishes to rajinikath on his birth day
  • ఆయురారోగ్యాలతో జీవించాలని  ఆకాంక్షిస్తూ ట్వీట్
  • శరద్ పవార్‌కు కూడా శుభాకాంక్షలు
  • రజనీకి ప్రత్యేకంగా మారనున్న బర్త్‌డే
నేడు బర్త్ డే జరుపుకుంటున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అలాగే, నేడు 81వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ కు కూడా మోదీ బర్త్ డే విషెస్ తెలిపారు. ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.

 కాగా, రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించిన రజనీకాంత్‌కు ఈ బర్త్‌డే ప్రత్యేకంగా నిలవనుంది. తన పార్టీ పేరును కూడా రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 31న పార్టీ పేరు, గుర్తును వెల్లడించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.
Rajinikanth
Tamil Nadu
Narendra Modi
Sharad Pawar
Birth Day

More Telugu News