KCR: అమిత్ షాతో భేటీ అయిన కేసీఆర్

KCR meets Amit Shah
  • కాసేపటి క్రితం జలశక్తి మంత్రితో ముగిసిన భేటీ
  • అక్కడి నుంచి నేరుగా అమిత్ షా వద్దకు పయనం
  • మోదీ అపాయింట్ మెంట్ కోరిన సీఎం కార్యాలయం
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ఆయన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. ప్రాజెక్టులు, నీటి సమస్యలకు సంబంధించి ఆయనతో కేసీఆర్ చర్చించారు.

ఈ భేటీ ముగిసిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై అమిత్ షాతో కేసీఆర్ చర్చలు జరపనున్నారు. మరోవైపు కేసీఆర్ వెంట కేవలం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోశ్ మాత్రమే ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఇతర నేతలను ఆయన తీసుకెళ్లలేదని తెలుస్తోంది.

మరోవైపు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ను కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం కోరింది. అపాయింట్ మెంట్ లభిస్తే మోదీని కేసీఆర్ కలుస్తారు. ఇప్పుడు ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

.
KCR
TRS
Amit Shah
BJP

More Telugu News