Remo DSounza: డైరెక్టర్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాకు గుండెపోటు

Choreographer Remo DSouza suffers heart attack
  • కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెమో
  • యాంజియోగ్రఫీ నిర్వహించిన వైద్యులు
  • రెమో వయసు 46 సంవత్సరాలు
బాలీవుడ్ సినీ దర్శకుడు, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఆయనకు యాంజియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు తెలిపారు.

రెమో డిసౌజా వయసు 46 సంవత్సరాలు. కిక్, జీరో, బాజీరావ్ మస్తానీ, భజరంగీ భాయీజాన్, యే జవాని హై వంటి చిత్రాలకు ఆయన పని చేశారు. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, డ్యాన్స్ ప్లస్, ఝలక్ దిక్లాజా వంటి డ్యాన్స్ రియాల్టీ షోలకు ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్నారు. 'ఫాల్తూ' సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి... రేస్-3, ఏబీసీడీ సిరీస్ లను తెరకెక్కించారు. రెమో గుండెపోటుకు గురయ్యారనే వార్తతో బాలీవుడ్ షాక్ కు గురైంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
Remo DSounza
Bollywood
Heart Attack

More Telugu News